Brahmamudi : అత్తకి హార్ట్ ఎటాక్.. ఫోన్ చేసినా పట్టించుకోని కోడలు!
on Sep 7, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -508 లో.... కళ్యాణ్ కి బర్త్ డే కి అప్పు సర్ ప్రైజ్ ఇస్తుంది. కేక్ కట్ చేయించి తనకి కవితలు రాయడానికి యూజ్ అయ్యేలా గిఫ్ట్ ఇస్తుంది. దాన్ని చూసి కళ్యాణ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇకనుండి నువ్వు కవితలు రాసుకోమని అప్పు అనగానే మనం బ్రతకాలంటే జాబ్ చెయ్యాలి అని కళ్యాణ్ అంటాడు. నేను చేస్తానని అప్పు అనగానే.. నేను ఉండగా నువ్వు చెయ్యడం ఏంటని కళ్యాణ్ అంటాడు. అంటే నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు రాసుకోమని అప్పు అంటుంది.
మరుసటి రోజు అందరు హాల్లో కూర్చొని కాఫీ తాగుతుంటారు. అప్పుడే ధాన్యలక్ష్మి వచ్చి అందరు ఈ రోజు ఏంటో కూడా మర్చిపోయారని అంటుంది. తన మాటలకి అందరు నవ్వుకుంటారు. నువ్వే ఇప్పుడు లేట్ గా వచ్చావ్.. మేం ఈ రోజు గురించి మర్చిపోలేదు. కళ్యాణ్ బర్త్ డే కి ఎప్పుడు చేసే విధంగా గుడికి వెళ్లి అభిషేకం చేయించి ఆ తర్వాత అన్నదానం చేయిస్తున్నామని ఇందిరాదేవి అంటుంది. మీరు వెళ్ళండి అత్తయ్య నేను రాలేనని అపర్ణ అంటుంది. అత్తయ్య తో పాటు నేను కూడా ఉంటానని కావ్య అంటుంది. మరొకవైపు రాహుల్ రుద్రాణితో ఇంట్లో ఎవరు లేనప్పుడు అపర్ణ అత్తయ్యకి ఏమైనా అయితే కావ్య మీదకి వస్తుంది. కావ్యని రాజ్ క్షమించడు.. ఆ డిప్రెషన్ లో రాజ్ ఆఫీస్ కి రాడు.. ఇక ఆఫీస్ సొంతం అవుతుందమని రాహుల్ అంటాడు. ఇప్పుడు అత్తయ్య రోజు వేసుకునే టాబ్లెట్స్ ప్లేస్ లో ఈ టాబ్లెట్ పెట్టు బీపీ ఎక్కువై హార్ట్ ఎటాక్ వస్తుందని రాహుల్ అంటాడు. కావ్య ఉంటుంది కదా అని రుద్రాణి అనగానే.. కావ్య లేకుండా వేరే ప్లాన్ చేసానని రాహుల్ అంటాడు. ఇక రుద్రాణి టాబ్లెట్ మారుస్తుంది. ఆ తర్వాత అందరు గుడికి వెళ్తారు. మరొకవైపు అప్పు, కళ్యాణ్ లు గుడికి వెళ్తారు. నా గురించి ఇంట్లో వాళ్ళు మర్చిపోయారని కళ్యాణ్ అంటాడు. అప్పుడే దుగ్గిరాల కుటుంబం గుడికి రావడం అప్పు చూపిస్తుంది. దాంతో కళ్యాణ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. రాహుల్ రుద్రాణిలు అప్పు, కళ్యాణ్ లని చూస్తారు. రాహుల్ ఆఫీస్ లో ఒకతనికి ఫోన్ చేసి ఆఫీస్ లో ఫ్రాడ్ జరుగుతుందని కావ్యకి చెప్పమంటాడు. ఆ తర్వాత కావ్య, అపర్ణలు సరదాగా మాట్లాడుకుంటారు.
తరువాయి భాగంలో అపర్ణ టాబ్లెట్ వేసుకుంటుంది. ఆఫీస్ లో ఫ్రాడ్ జరిగిందంటు కావ్యకి ఫోన్ రావడంతో ఆఫీస్ కి వెళ్తుంది. ఆ తర్వాత అపర్ణ కి హార్ట్ ఎటాక్ వస్తుంది. కావ్యకి ఫోన్ చేస్తుంది కానీ కావ్య లిఫ్ట్ చెయ్యదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read